రామోజీ.. “ఈనాడు” పై యుద్దం తప్పదని ycp ఎంపి విజయ సాయిరెడ్డి హెచ్చరించారు. 5 దశాబ్దాలుగా వస్తున్న “ఈనాడు” 1982లో టిడిపితో జతకట్టి తెలుగు రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసిస్తూ…తెలంగాణ ఏర్పాటు అయ్యే వరకు సామాజిక విధ్వంసానికి పాల్పడిందని మండిపడ్డారు. టీడీపీ ప్రత్యర్థులు తమ ప్రత్యర్థులుగా వారి వ్యక్తిత్వ హననాన్ని కొనసాగిస్తున్నారు ఈ పచ్చ కుల మీడియా దురంధరులు అని నిప్పులు చెరిగారు.
అధికారం చేజారాక ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిల కొట్టుకుంటున్నారు టీడీపి, పచ్చ కుల మీడియా బాసులు. సామాజికంగా, ఆర్ధికంగా వాళ్ళ వర్గం బలంగానే ఉంది. సర్వనాశనం అయింది బడుగు, బలహీనవర్గాలే. ఈ విధ్వంసాన్ని ఇకనైనా ఆపాలి. లేదంటే ఆ బడుగు వర్గాల ప్రజలే తిరగబడి తరిమి కొడతారని హెచ్చరించారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తే అసలువాళ్ళు కలుగుల్లో దాక్కుంటే కుక్కమూతె పిందేలేంటి మొరుగుతున్నాయి చంద్రం? ఆచరించే వాళ్ళు నీతులు చెప్పాలి. సెటైర్లు వేసినా, వెటకారం చేసినా, దుష్ప్రచారం చేసినా, కుల పత్రికలున్నాయని చెలరేగినా… యుద్ధం తప్పదు రామని వార్నింగ్ ఇచ్చారు.
ఓపెన్ ఛాలెంజ్ చేస్తే అసలువాళ్ళు కలుగుల్లో దాక్కుంటే కుక్కమూతె పిందేలేంటి మొరుగుతున్నాయి చంద్రం? ఆచరించే వాళ్ళు నీతులు చెప్పాలి. సెటైర్లు వేసినా, వెటకారం చేసినా, దుష్ప్రచారం చేసినా, కుల పత్రికలున్నాయని చెలరేగినా… యుద్ధం తప్పదు రాము. pic.twitter.com/a4v8F3BOMp
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 12, 2022