బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేదు..దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అప్రోచ్ రోడ్లతో కొంత కష్టాలు వచ్చాయి..బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించటానికి ప్రతిష్టాత్మకంగా దుర్గగుడి ఫ్లై ఓవర్ ను నిర్మించించారు..కాని అప్రోచ్ రోడ్డును మాత్రం అనుకున్న మేర విస్తరించకపోవటంతో ఆశించిన మేర లక్ష్యం నెరవేరటంలేదు..భూసేకరణ జరిపి జాతీయ రహదారి విస్తరణ చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులు రాసిన లేఖలను సైతం రెవెన్యూ శాఖ పక్కన పెట్టేయటంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది..భూసేకరణ లేకుండానే వంతెన నిర్మాణం పూర్తి చేయాలనటంతో హైదరాబాద్ వైపు వెళ్ళే రూట్ కుంచించుకుపోయింది. ఈ కారణంగా ఫ్లై ఓవర్ పై కూడా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఫ్లై ఓవర్ పై వాహనాలకు అనుమతించిన మొదటిరోజే ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది..ఫ్లై ఓవర్ సెల్ఫీ స్పాట్ గా మారటం కూడా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది..ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలు..అప్రోచ్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట డేంజర్ జోన్‌గా మారింది..ఇక ఫ్లై ఓవర్‌కి రెండో వైపు పండిట్ నెహ్రూ బస్టాండ్ ఉన్న వైపు పరిశీలిస్తే కూడా ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ఇటు ఇంద్రకీలాద్రి గుడి సమీపంలో పారా వంతెన దగ్గర కొంత భాగం అప్రోచ్ రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం వాహనాల రద్దీ పెరిగింది. దీనితోపాటు దుర్గగుడి ఫ్లై ఓవర్‌పై వెళ్ళే వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది.
దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ఆరు లైన్ల రహదారిగా చేయడంతో పాటు సర్వీస్ రోడ్డు కూడా ఆరులైన్లు చేయాలని ముందు ప్రతిపాదనలు సిద్ధం చేశారు..కానీ ఇప్పుడు సర్వీస్ రోడ్డు చూస్తే కుంచించుకుపోయింది.. కొన్నిచోట్ల సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. ఫ్లై ఓవర్ 1995 మీటర్లు ఉంటే అప్రోచ్ రోడ్డు 605మీటర్లు మాత్రమే ఉంది..ఫ్లై ఓవర్ దిగేవరకు ఆరు వరుసల రోడ్డు ఉంటే దిగువకు వచ్చే సరికి అది నాలుగు లైన్లు మాత్రమే ఉంది. దీంతో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి..అయితే అక్కడ రోడ్ల విస్తరణ కోసం భూసేకరణకు నష్టపరిహారం కోట్లలో ఉండటంతో రెవిన్యూ శాఖ ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. ఇప్పుడు నిర్మాణం పూర్తవటంతో ఈ మేర ఫలితం దుర్గగుడి ఫ్లై ఓవర్ నుంచి బెజవాడ వాసులు పొందలేకపోతున్నారు.
కేవలం 25 కోట్ల నష్టపరిహారం గురించి ఆలోచించి..500కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ వల్ల పూర్తిస్థాయిలో ప్రయోజనం లేకుండాచేశారంటున్నారు బెజవాడ వాసుల.. జాతీయ రహదారిని అప్రోచ్ రోడ్ల వద్ద విస్తరణ చేపట్టాలని లేదంటే ముందు ముందు ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా జరగొచ్చన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.