Vijaykanth: తమిళ్ హీరో విజయ్ కాంత్ కాలి వేళ్లు తొలగించిన వైద్యులు..కారణమేమిటంటే?

-

తమిళ్ సీనియర్ హీరో, రాజకీయ నాయకుడు డీఎండీకే (దేశియ మురపొక్కు ద్రవిడ కజగం) పార్టీ చీఫ్ విజయ్ కాంత్ కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా విజయ్ కాంత్ ఆరోగ్యం విషయమై డీఎండీకే పార్టీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది.

ఆయన హెల్త్ అప్ డేట్ ఇచ్చేసింది. విజయ్ కాంత్ కొంత కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, ఆయన కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కుడి కాలికి సంబంధించిన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించినట్లు డీఎండీకే వర్గాలు తెలిపాయి.

విజయ్ కాంత్ ఆరోగ్యంపై అసత్యాలు ప్రచారం చేయొద్దని డీఎండీకే ప్రకటించింది. విజయ్ కాంత్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, విజయ్ కాంత్ అనారోగ్యం గురించి తెలుసుకుని సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.

విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆకాంక్షించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ప్రియ స్నేహితుడు విజయ్ కాంత్ త్వరగా కోలుకుని గతంలో లాగానే కెప్టెన్‌లా గర్జించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news