వికారాబాద్ లో వింత వ్యాధి..కళ్లు తిరిగి కింద పడి పోతున్న ప్రజలు ?

-

వికారాబాద్ మండలాల్లో వింత వ్యాధి వెలుగులోకి వచ్చింది.  ఒక్కసారిగా కళ్లు తిరిగి వాంతులు,  విరేచనాలతో కింద ప్రజలు పడిపోతున్నారు. పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో జనాలు ఇలా పడిపోతుండడం సంచలనంగా మారింది. ఇప్పటికే పదుల  సంఖ్యలో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. రోగం ఏమిటో తెలియక చెందుతున్న స్థానికులు  ఆందోళన చెందుతున్నారు. కళ్లలో మంటలు, వాంతులు, విరోచనాలు లక్షణాలు ఉండడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. కొంతమంది కింద పడిపోవడంతో గాయాలు అయినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికే  సంఘటన స్థలానికి చేరుకున్న వైద్యాధికారులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితి ఏమిటో పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇది కల్తీ కల్లు అని అనుమానిస్తున్నారు. రెండు మండలాల పరిధిలోని పది గ్రామాల్లో కల్తీ కల్లు భాదితులు ఉన్నారని గుర్తించారు. పదుల సంఖ్యలో బాధితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే కల్లు డిపోను సీజ్ చేశారు అధికారులు. బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటిస్తున్నారు. పలు గ్రామాల్లో హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశారు అధికారులు.ఇక ఈ కల్తీ కల్లు వలన ఇద్దరు మృతి చెందారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news