వైరల్ వీడియో: మాజీ ప్రియుడిని హగ్ చేసుకున్న వధువు.. హర్ట్ అయిన వరుడు..!

-

పెళ్లికి ముందు ప్రేమలో పడటం కామన్. యువతీ లేదా యువకుడు ప్రేమలో పడుతుంటారు. ఆ తర్వాత కొన్ని విభేదాలు వచ్చాక సంతోషంగా విడిపోతారు కూడా. కానీ ప్రేమికుల్లో ఇద్దరిలో ఒకరికి వివాహం జరిగితే.. ఆ పెళ్లికి ఆ ప్రేమికుడు వస్తే ఎలా ఉంటుంది. సమాజంగానే ఎంతో ప్రేమించిన ప్రియురాలిని.. వేరేవరో పెళ్లి చేసుకుంటే చాలా బాధ వేస్తుంది. పెళ్లి పీటలపై ఆమె కూర్చున్నప్పుడు ఆ పెయిన్ ప్రియుడికి భరించరానిది. పెళ్లి తతంగాన్ని దూరంగా చూస్తూ లోలోపల కుమిలిపోతుంటాడు.

ప్రేమించుకున్న తర్వాత సంతోషంగా విడిపోతే బాగుంటుంది. ఇద్దరికీ కుదరదు అనుకున్నప్పుడు ఫ్రెండ్లీగా విడిపోవడంలోనే ఆనందం ఉంటుంది. అప్పుడే భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వధువుకి పెళ్లి జరుగుతుంది. సడెన్ గా అక్కడికి మాజీ ప్రియుడు వస్తాడు. దీంతో వధువు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతుంది. పెళ్లి ఫంక్షన్ లో వరుడి ముందు మాజీ ప్రియుడు వచ్చి నిలబడితే ఏం చేయాలో తోచని పరిస్థితి. ఆమె సంతోషానికి ఆనకట్ట పడినట్లు అవుతుంది. మాజీ ప్రియుడిని చూసిన ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఇలాంటి ఘటనే ఇండోనేషియా దేశంలోని ఓ పెళ్లిలో చోటు చేసుకుంది.

పెళ్లికి హాజరైన తన మాజీ ప్రియుడిని వధువు ముందు కౌగిలించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఓ వధువు. దీనికి ఆమె వరుడి పర్మిషన్ తీసుకోవడం గమనార్హం. పెళ్లికి సంబంధించిన ఈ వీడియోను ఇటీవల ఆ వధువు తన టిక్ టాక్ అకౌంట్ లో పోస్ట్ కూడా చేసింది. మాయాంగ్ కుమ్వే అనే టిక్ టాక్ అకౌంట్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె పెళ్లిలో జరిగిన ఈ తతంగం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ పెళ్లికి నా మాజీ ప్రియుడు హాజరయ్యాడు. మా ఇద్దరిని విష్ కూడా చేశాడు.’’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version