టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్టు ను 100 లోపు ఆలౌట్ చేసిన జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. నిలిచాడు. ఒక ప్రత్యర్థి జట్టు ను అత్యధికంగా మూడు సార్లు విరాట్ కోహ్లీ నాయకత్వం లో టీమిండియా ఆల్ అవుట్ చేసింది. అత్యధిక సార్లు ప్రత్యర్థిని ఆల్ అవుట్ చేసిన కెప్టెన్ లలో కోహ్లీ తర్వాత భారత్ నుంచి గంగూలీ తో పాటు ద్రవిడ్ ఉన్నారు.
వీరు తమ కెప్టెన్సీ లో రెండు సార్లు ప్రత్యర్థులను ఆల్ అవుట్ చేశారు. అలాగే గవాస్కర్ తో పాటు అజారుద్దీన్ కూడా ప్రత్యర్థి జట్టును ఒక్కో సారి ఆల్ అవుట్ చేశారు. కాగ ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగం గా రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ ను కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు.