విశాఖలో స్థానిక ఎన్నికల‌ వేళ పార్టీల్లో కొత్త టెన్షన్

-

గెలిస్తే ఓకె.. గెలిపించుకున్నా ఓకె… ఏం చేసైనా పాగా వేయటం మాత్రం పక్కాగా ఉండాలి. ఖర్చుకు వెనకడొద్దు. పదవి సంగతి పక్కన బెట్టండి.. అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. చెక్ పవర్ కూడా సెట్ చేద్దాం. అంతా మేం చూసుకుంటాం. ఇదీ విశాఖ జిల్లాలో మేజర్ పంచాయతీల్లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం. రిజర్వ్డ్ స్థానాల్లో ఎన్నికల ఖర్చు పెట్టించేందుకు ప్రధాన పార్టీలు ఇప్పుడు బలమైన నాయకులకు ఈ మాటలు చెప్పి గేలం వేస్తున్నాయట. పంచాయతీ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో అమాంతం పెరిగిన ఖర్చుతో అభ్యర్ధుల వేటలో అన్ని పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుందట..‌.


గెలిస్తే ఓకె.. గెలిపించుకున్నా ఓకె… ఏం చేసైనా పాగా వేయటం మాత్రం పక్కాగా ఉండాలి. ఖర్చుకు వెనకడొద్దు. పదవి సంగతి పక్కన బెట్టండి.. అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. చెక్ పవర్ కూడా సెట్ చేద్దాం. అంతా మేం చూసుకుంటాం. ఇదీ విశాఖ జిల్లాలో మేజర్ పంచాయతీల్లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం. రిజర్వ్డ్ స్థానాల్లో ఎన్నికల ఖర్చు పెట్టించేందుకు ప్రధాన పార్టీలు ఇప్పుడు బలమైన నాయకులకు ఈ మాటలు చెప్పి గేలం వేస్తున్నాయట

విశాఖజిల్లాలో 39మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రేటర్ నగరం మినహా గ్రామీణ ప్రాంతం రాజకీయ ఎత్తుగడలతో హాట్ హాట్ గా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ లో స్వీప్ చేసిన వైసీపీ, లోకల్ వార్ వన్ సైడ్ చేయాలని చూస్తోంది. ఇందు కోసం ప్రత్యేక తాయిలాలు పేరుతో ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాగా చాలా గ్రామాల్లో పరువు కీలకంగా మారింది. ఏకగ్రీవాలతోనే అభివద్ధి సాధ్యమని ప్రభుత్వంనూరిపోస్తుంటే…ఆధిపత్యం నిలబెట్టుకోవడమే ముఖ్యం అంటున్నాయి పల్లె రాజకీయాలు. దీంతో ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపతుందనే టెన్షన్ మొదలైంది. మేజర్ పంచాయతీల్లో అయితే అరకోటి లేకపోతే కష్టం అనే లెక్కలు ఉన్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా…. రిజర్వ్డ్ పంచాయితీలు వ్యవహారం ఎమ్మెల్యేలకు,నాయకత్వంకు క్లిష్టంగా మారిందట.

తొలివిడతలో ఎన్నికలు జరుగుతున్న అనకాపల్లి డివిజన్ లో మేజర్ పంచాయితీలను దక్కించుకోవడం పెద్ద సవాల్. మొత్తం 15మేజర్ పంచాయతీల్లో అధిక శాతం రిజర్వ్ అయిపోయాయి. ఈ స్థానాల్లో ఖర్చు సంగతి ఇప్పుడు అసలు సమస్య. మేజర్ పంచాయతీల్లో కాస్త అటు ఇటుగా ఓటర్ల సంఖ్య పదివేలు. ఎన్నికలంటేనే కోట్ల వ్యవహారంగా మారిన తరుణంలో ఇక్కడ లెక్కలు అంచనాలకు అందడం లేదు. కనీసం 50లక్షలు లేకపోతే కష్టం అనే అంచనాలకు పార్టీలు, అభ్యర్థులుముందే వచ్చేశారు.

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం, బిర్యానీ లు, మద్యం, ప్రచారం, స్థానిక నాయకులకు తాయిలాలు ఇలా లెక్కలేసుకుంటే తడిసిమోపెడవుతోంది. దీంతో ఆ మేరకు శక్తి సామర్ధ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం గాలించిన పార్టీలు, చాలా చోట్ల విజయవంతం కాలేకపోయాయి. దీంతో ఎలక్షన్ ఖర్చు కోసం ప్లాన్-బి సిద్ధం చేశారు. వైస్ సర్పంచ్ అభ్యర్థులు, ప్రతిష్ట కోసం ప్రాకులాడుతున్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఖర్చులు మీరు చూసుకోండి… గెలిచేది మనమే కనుక అంతా సెట్ చేద్దామని భరోసా కల్పి స్తున్నారట. దీంతో భవిష్యత్ రాజకీయాలు పై ఆశ ఉన్న నేతలు సొమ్ము రెడీ చేసుకుని బరిలోకి దిగుతున్నారట.

ఎమ్మెల్యేల పరిధిలో వుండే ఎన్ ఆర్ ఈజీఎస్ వర్క్స్, ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇలా లెక్కలేసుకుంటే గిట్టుబాటు అవుతుందనే అంచనాలు ఉన్న వాళ్ళు ఉత్సాహంగా రంగంలోకి దిగుతున్నారట. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఇదే ప్రధాన సమస్యగా మారింది. అధికార వైసీపీని తట్టుకుని నిలబడాలంటే లెక్క పక్కాగా ఉండాల్సిందే. ఆ మేరకు అభ్యర్థులు, నాయకత్వం చివరి వరకు పోరాటం సాగించగలరా..ఖర్చులు భరించి నిలబడేది ఎవరు పోరాడి పీఠం హస్తగతం చేసుకునేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news