Vishal 32 : ”లాఠీ”తో వచ్చేసిన హీరో విశాల్

-

హీరో విశాల్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళ్ చిత్ర పరిశ్రమ మరియు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ కు మంచి క్రేజ్ ఉంది. హిట్ ఫ్లాఫ్ ల తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ ఇటీవలే మరో సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.

ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో.. యాక్షన్ మూవీ చేస్తున్నాడు హీరో విశాల్. రాణా ప్రొడక్షన్ పతాకంపై రమణ మరియు నంద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ కు జోడీగా నటిస్తోంది.

అయితే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మోషన్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. “లాఠీ” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఇందులో హీరో విశాల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news