ఖమ్మం జిల్లాపై కమలం ఫోకస్.. ఆ నాయకులని లాగేస్తారా?

-

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు బి‌జే‌పి….అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందివచ్చిన ఏ అంశాన్ని కూడా వదులుకోకుండా తెలంగాణలో ఎదగడానికి కష్టపడుతుంది. అయితే గతంతో పోలిస్తే…ఇప్పుడు రాష్ట్రంలో బి‌జే‌పి చాలావరకు బలపడింది. ఇక ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని చేర్చుకుని, అధికార టి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ బలోపేతం కోసం బాగా కష్టపడుతున్నారు. గతంలో పనిచేసిన అధ్యక్షులకు భిన్నంగా బండి పనిచేస్తున్నారు.

అలాగే ఇటీవల పాదయాత్ర చేసి….ప్రజల్లోకి బి‌జే‌పిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే కాదు….రాజకీయంగా ఇతర పార్టీ నాయకులని చేర్చుకుని బలపడేందుకు కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో బండి…. ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేశారని తెలిసింది. అసలు ఖమ్మంలో కమలం పార్టీకి ఏ మాత్రం పట్టు లేదు. అసలు ఇక్కడ బి‌జే‌పికి ఇంతవరకు డిపాజిట్లు కూడా రాలేదు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్‌లే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే ఖమ్మంలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని లాగేసుకుని టి‌ఆర్‌ఎస్ కూడా బలపడింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఖమ్మంలో తాము కూడా సత్తా చాటాలని బండి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్‌ల్లో ఉన్న అసంతృప్తిగా ఉన్న నేతలనీ బి‌జే‌పిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఖమ్మంలో బలమైన వర్గంగా ఉన్న కమ్మ కులంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని బి‌జే‌పిలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట.

చాలా ఏళ్ళు టి‌డి‌పిలో కీలకంగా పనిచేసిన తుమ్మల ఆ తర్వాత టి‌ఆర్‌ఎస్‌లో చేరి మంత్రి కూడా అయ్యారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే తుమ్మల మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిని టి‌ఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో తుమ్మలకు ప్రాధాన్యత తగ్గింది…ఎమ్మెల్సీ పదవి లేదు…మంత్రి పదవి రాలేదు. ఈ క్రమంలోనే తుమ్మల టి‌ఆర్‌ఎస్ నుంచి బయటకెళ్ళేందుకు సిద్ధమయ్యారని ప్రచారం వస్తుంది. అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్‌లు తుమ్మలని తమ తమ పార్టీల్లోకి లాగేందుకు చూస్తున్నారట. మరి తుమ్మల టి‌ఆర్‌ఎస్‌లోనే ఉంటారా? లేక వేరే పార్టీలోకి జంప్ చేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news