జగన్‌తో విశాల్..కుప్పంలో నో..కానీ ట్విస్ట్.!

-

సినీ నటుడు విశాల్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఏపీ మూలాలు ఉన్న విశాల్ తమిళ సినిమా ఇండస్ట్రీలో కీలక నటుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల్లోనే కాదు..సామాజిక సేవ చేయడంలో విశాల్ ముందు ఉంటారు. అలాగే రాజకీయాలపై కూడా విశాల్‌కు అవగాహన ఉంది. అయితే విశాల్ తండ్రి జి‌కే రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త..ఈయన గతంలో కుప్పంలో పలు వ్యాపారాలు చేశారు.

దీంతో విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. వైసీపీ తరుపున పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తాను చంద్రబాబుపై పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా తాను నటించిన లాఠీ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో విశాల్..తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకలు చేశారు. ఈ వేడుకలకు మోహన్ బాబుని ఆహ్వానించారు. ఆ వేడుకల్లో మోహన్ బాబు పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికారులు తొత్తులు మాదిరిగా పనిచేస్తున్నారని అన్నారు.

అదే సమయంలో మరొకసారి తాను కుప్పంలో పోటీ చేయడం లేదని విశాల్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆయన..జగన్‌ని కలవనున్నారు. జగన్ అంటే తనకు ఇష్టమని, ఆయన పాదయాత్ర చేసేటప్పుడే సీఎం అవుతారని చెప్పానని, సీఎం అయ్యాక కలవలేదని, అందుకే ఇప్పుడు కలుస్తానని, ఇందులో రాజకీయం ఏమి లేదని అన్నారు.

అటు వైసీపీ సైతం కుప్పం నుంచి భరత్ పోటీ చేస్తారని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే రెడ్డి వర్గానికి చెందిన విశాల్‌కు జగన్ అంటే బాగా ఇష్టమని, అందుకే ఆయన్ని కలుస్తున్నారని తెలుస్తోంది. కానీ రాజకీయంగా ఏమి లేదని అంటున్నారు..కాకపోతే జగన్‌కు మద్ధతుగా ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకముందు రాజకీయాల్లోకి వస్తానని విశాల్ అన్నారు..కాకపోతే ఏపీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి విశాల్ కూడా రాజకీయం బాగానే చేస్తున్నారు..పవన్ అంటే అభిమానం అని చెబుతూనే..జగన్ అంటే ఇష్టమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news