గురుకుల పాఠశాలలో కలకలం..25 మంది విద్యార్థినులకు వాంతులు-విరేచనాలు

-

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కలకలం రేపింది. ఈ ముత్తంగి గురుకుల పాఠశాలలో ఏకంగా 25 మంది విద్యార్థినులకు వాంతులు విరోచనాలు సంభవించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికి ఆ విద్యార్థులకు వాంతులు – విరోచనాలు అయ్యాయి. అయితే…. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో…. ఆ ముగ్గురు విద్యార్థులను… సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. దీంతో ముత్తంగి గురుకుల పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిగతా వారు పాఠశాలలోనే ఉన్నారు.

కాగా…నిన్న ఇదే పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యా యురాలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 ఉపా ధ్యాయులు ఉన్నారు. అయితే.. నిన్న చేసిన కరోనా నిర్ధారణ పరీక్ష ల్లో ఏకంగా.. 42 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ రాగా.. 1 ఉపాధ్యా యు రాలి కి పాజిటివ్‌ వచ్చింది. ఇక తాజాగా 25 మంది విద్యార్థులకు విరేచనాలు సంభ వించాయి.

Read more RELATED
Recommended to you

Latest news