నిన్న సాయంత్రం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. దీంతో మునుగోడులో పంపకాలు మొదలు అయ్యాయి. ప్రలోభాలకు పార్టీలు తెర తీసాయి. ఓటుకు మూడు వేలు ఇచ్చిన ఒక పార్టీ.. రెండో విడత పంపకం ఉంటుందని హామీ ఇస్తోందట.
ఈ తరుణంలోనే మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల ఇళ్ల ముందు కొరిటికల్ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు పంచడం లేదని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 10వేలు నగదు, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక రేపు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
బిజెపి నాయకులు ఇంటి వద్ద గొడవ చేస్తున్న కొరటికల్ గ్రామ ప్రజలు. డబ్బు పంపిణీలో సక్రమంగా ఇవ్వలేదని తులం బంగారం కూడా ఇంకా అందలేదని గొడవ. pic.twitter.com/dA1Bndm9VB
— దేశం కోసం ధర్మం కోసం (@KBeedi) November 2, 2022