ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్ కి కీలక పదవి

-

భారత్ క్రికెట్ లో నవశకం మొదలుకానుంది. ఇండియాలో క్రికెట్ ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయడానికి పావులుకదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఐసిసి లో కీలక పదవి చేపట్టారు. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు మంగళవారం ఐసిసి పేర్కొంది. లక్ష్మణ్ తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేసామని బర్నింగ్ హం వేదికగా జరిగిన ఐసిసి వార్షిక సమావేశంలో పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ మహిళా జయవర్ధనే మెన్స్ క్రికెట్లో పాస్ట్ ప్లేయర్ ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. అయితే రోజర్ హార్బర్ ఫాస్ట్ ప్లేయర్స్ రెండో ప్రతినిధిగా వ్యవహరించనున్నాడు. ఇక 2025లో మహిళల వన్డే ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నదని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news