యుఎస్ఏ లో సైరా రికార్డ్ బద్దలు కొట్టిన చిరంజీవి..!!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి 10 రోజులు అయినా  కూడా ఇంకా వసూళ్ళు వర్షం కురిపిస్తూనే ఉంది. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 3 రోజుల్లో 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత మంచి మార్కెట్ గా చెప్పుకొనే యుఎస్ఏ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే యూ ఎస్ లో రెండోవ మిలియన్ మార్కును అధిగమించింది. బుదవారం నాటికి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2.3 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించి రికార్డ్ బ్రేక్ వసూళ్ళు సాధిస్తోంది. దీనితో  యుఎస్ఏ లో తన గత సైరా నరసింహ రెడ్డి హయ్యెస్ట్ వసూళ్ల ను కూడా బ్రేక్ చేసింది.ఇంకొన్ని రోజులు వసూళ్ళు ఇలాగే ఉంటాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version