క్షణాల్లో వైరల్ అయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్…1 మిలియన్ క్రాస్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్ లుక్ లో కనిపించనుండడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వరుస అప్డేట్ లతో ప్రేక్షకులలో మంచి హైట్ ని క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ ట్రైలర్ చిరు రెట్రో లుక్ లో అదరగొట్టాడు. ఓవైపు మాస్ యాంగిల్ చూపిస్తూనే.. మరోవైపు తనదైన కామెడీతో అదరగొట్టాడు. ఇక డైలాగ్స్ ఐతే చెప్పక్కర్లేదు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన క్షణాలలోనే వన్ మిలియన్ క్రాస్ చేయడం విశేషం. మెగా అభిమానుల ఊపు చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టబోతుందో అర్థమైపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news