ప్రెగ్నెన్సీ టైమ్‌లో ముక్కు పెద్దదిగా అవుతుందా..?

-

ప్రెగ్నెన్సీ టైమ్‌లో బాడీలో మార్పులు రావడం సహజం.. కానీ మీకు తెలుసా.. ముక్కులో కూడా మార్పులు వస్తాయని. ముక్కు పెద్దదిగా అయితే ప్రెగ్నెన్సీ ఉన్నట్లే.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో నెలలు పెరిగే కొద్దీ ముక్కులో మార్పులు వస్తాయి. రోజు రోజుకి తేడా కనిపిస్తుంటుంది. దీంతో చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ తర్వాత అనే ఫోటోలను షేర్ చేస్తున్నారు. చాలా సందర్బాల్లో గర్భం పెరిగే కొద్ది వారి ముక్కు కూడా పెరిగినట్లుగా ఉంటుంది. అయితే, ఈ మార్పులు అందరికీ ఒకేలా ఉండాలని కాదు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంత మంది మహిళలకు చిన్నగా ఉంటే, మరికొంత మహిళలకు వెంటనే గుర్తించేలా ఉంటాయి.

ముక్కు ఎందుకు పెద్దదిగా అవుతుంది..?

ప్రెగ్నెన్సీ టైమ్‌లో హార్మోన్స్ స్పెషల్లీ ఈస్ట్రోజెన్, రక్తప్రవాహాన్ని ప్రతిచోటా పెంచుతాయి. ముఖ్యంగా శరీరంలోని శ్లేష్మ పొరలకు రక్తప్రవాహాన్ని కూడా పెంచుతాయి. ఇది ఆ ప్రాంతాల్లో వాపు, ఉబ్బరం కలిగిస్తుంది. సహజంగా ముక్కులు శ్లేష్మ పొరలను కలిగి ఉంటాయి. అందుకే గర్భధారణ టైమ్‌లో ముక్కు పెద్దదిగా అనిపిస్తుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మరో మార్పు కూడా ఉంటుంది. దీనినే ప్రెగ్నెన్సీ రినిటిస్ అంటారు. అదే శ్లేష్మ పొరల వాపు వల్ల వస్తుంది. ఇది ముక్కు దిబ్బడకి కారణమవుతుంది. ముక్కులో మార్పులు గమనించకపోతే కొంతమంది ఈ ముక్కు దిబ్బడ ద్వారా కూడా గుర్తించొచ్చు.
సాధారణంగా ముక్కు పెద్దదిగా మారితే చాలా మంది కాస్తా ఇబ్బంది పడతారు. అయితే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన ముక్కు పరిమాణం గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇది అంతగా హానికరం కాదు. కొన్నిరోజులకు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇది ఆరు వారాలలోపు తిరిగి మామూలు స్థితికి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. .
ప్రెగ్నెన్సీ నోస్ అనేది ఈ మధ్యకాలంలోనే బాగా వినబడుతోంది. ఈ మధ్యకాలంలో దీనిని చాలా మంది అనుభవిస్తూ వారు సోషల్ మీడియా వేదిక ద్వారా #ప్రెగ్నెన్సీ నోస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news