కస్టమర్ కోసం డెలివరీ బాయ్ చేసిన సాహసం చూడండి..గ్రేట్..

-

ఈ మధ్య డెలివరీ బాయ్స్ తమ డ్యూటీ కోసం ప్రాణాలను లెక్క చెయ్యకుండా పనిని పూర్తి చేస్తున్నారు.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉన్నాము..తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.అది ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది…

ఓ ‍వ్యక్తి తన పని మీద ఉన్న డెడికేషన్‌ చూపించాడు. దీంతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో హీరో అయిపోయాడు. కదులుతున్న రైలును సైతం చేజ్‌ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును డెలివరీ చేశాడు.అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.వివిధ రకాల వస్తువులను హోమ్‌ డెలివరీ అందించే డంజో ఏజెంట్‌ రన్నింగ్‌లో ఉన్న రైలు వెంట పరుగెత్తి మరీ తన కస్టమర్‌ ఆర్డర్ చేసిన వస్తువులను అందించాడు. కాగా, ఆ కస్టమర్‌ ఏజెంట్‌ అందించిన వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేసింది..కాగా,ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది..

ఆ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్‌లో పరుగెత్తుకుంటూ కనిపిస్తాడు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రైలు నెమ్మదిగా కదులుతోంది. క్రమంగా రైలు వేగం పెరిగింది. ఇంతలోనే డంజో డెలివరీ బాయ్ ఓ సంచితో పరుగెత్తుకుంటూ ఫ్లాట్ ఫాంపైకి వచ్చాడు. రైలులో డోర్‌ వద్ద నిలబడిన ఓ మహిళ డంజో డెలివరీ బాయ్‌ను ఫాస్ట్‌.. ఫాస్ట్‌ అంటూ చేతులతో సైగలు చేసింది. అతను రైలు వెంట వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలోని ఆర్డర్‌ను సదరు మహిళకు అందించాడు.. దాంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి అతను సెలెబ్రేటి అయ్యాడు.. నెటిజన్లు అతను చేసిన పనికి ప్రశంసలు కురిపించారు. అతని డేడికేషన్ కు ప్రమోషన్ ఇవ్వాలి,డబల్ టిప్ ఇవ్వాలి అంటూ కామెంట్లు కూడా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news