ఉస్మానియా ఆస్పత్రి.. ముందుకు వచ్చిన అయ్యప్ప సేవా సమితి.. తీరిన నీటి కష్టాలు..

-

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో నీటి కష్టాలు తీరినట్టే అని చెప్పాలి. పల్లెల నుండి ఆస్పత్రికి వచ్చే వారు తాగునీటి కోసం పడుతున్న కష్టాలకు కాలం చెల్లింది. అటు వైద్యం గురించి దిగులు చెందుతుంటే, ఇటు తాగడానికి నీళ్ళు దొరక్క ఇబ్బంది పడిన సందర్భాలు ఇక ఉండవు. అవును, ఉస్మానియా ఆస్పత్రిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రిలో వాటర్ ప్లాంటు నిర్మాణం జరిగింది.

ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి 20లక్షలు ఖర్చు అయ్యిందని, దీనిద్వారా పరిశుద్ధమైన తాగునీరు లభిస్తుందని తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చే వారికి తాగునీరు, అది కూడా శుద్ధమైన నీరు దొరకడం చాలా ముఖ్యం. దాని కొరకు సహాయం చేసిన అయ్యప్ప సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news