పీడ కలలు వస్తున్నాయా..? ఇలా చేస్తే రావు..!

-

సహజంగా ప్రతి ఒక్కరికి కూడా నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి రకరకాల కలలు మనకి రోజు వస్తూ ఉంటాయి. అయితే పీడకలలు కూడా సర్వసాధారణంగా చాలా మందికి వస్తూ ఉంటాయి. మీకు కూడా పీడ కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయా..? అయితే కచ్చితంగా మీరు దీనిని తెలుసుకోవాలి.. పీడకలలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. పీడకలల వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు.

కలలు | Dreams

దెయ్యాలు వెంటపడినట్టు అనిపించడం పడిపోయినట్టు అనిపించడం ఎక్కడో చిక్కుకుపోయినట్లు ఇలా భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కొంత మందికి చెమటలు కూడా పట్టేస్తుంటాయి. పైగా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది ఒత్తిడి ఆందోళన ఎక్కువవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా పీడ కలలే రాకూడదంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి వాటిని తీసుకుంటే పీడకలను రావు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

రాత్రి పిడకలలు రాకూడదంటే పడుకునే ముందు ఒక కప్పు చామంతి టీ ని కానీ లేవండర్ టీ ని కానీ తాగండి అప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి అవుతుంది. పీడకలల బాధ ఉండదు పాలు పెరుగు జున్ను ఇలా కాల్షియం ఉండే వాటిని తీసుకుంటే కూడా పీడకలలు ఎక్కువగా రావు. బచ్చలి కూర ఆకుకూరలు కూడా తీసుకోవచ్చు ఇవి కూడా పీడకలలు రాకుండా చేస్తాయి.

కాలీఫ్లవర్ తీసుకుంటే కూడా పీడకలలు రావు. చేపలు గుడ్లు మొలకెత్తిన విత్తనాలు సీ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటే కూడా మంచిగా నిద్ర పట్టి పీడకలలు రావు. బ్రౌన్ రైస్ చిలగడ దుంపలు వంటి పిండి పదార్థాలు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా నిద్రపోవడానికి సహాయపడతాయి పీడ కలలు రావు. అరటి పండ్లు పౌల్ట్రీ తృణధాన్యాలు కూడా తీసుకోవచ్చు ఇలా వీటితో పీడ కలలే లేకుండా హాయిగా నిద్రపోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్య బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news