రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 42వ రోజుకు చేరింది. ఇప్పటివరకు లోకేష్ 529.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మద్దయ్యప్ప గారి పల్లి నర్సరీ వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు నారా లోకేష్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై దాడులు, అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసులు 36 వేల మందిపై పెట్టారని.. సిద్ధాంతాన్ని నమ్ముకున్నామని, ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అరాచకం సృష్టించారని.. వచ్చేదే మేము.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లకు జీతాలు లేవని, కుర్చీలు కూడా లేవన్నారు.