నేచర్ అంటే చాలామంది ఇష్టపడతారు.. చుట్టు ఎత్తైన చెట్లు..ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎవరు కోరుకోరు.. కానీ వాళ్లు తమ జీవితంలో ఒక్క మొక్కను అయినా నాటతారా అంటే డౌటే.. కనీసం.. పుట్టినరోజు నాడైనా…ఒక మొక్క నాటండి అని ప్రకృతి ప్రేమికులు చెప్తుంటారు. కానీ వివిధ కారణాలు వల్ల మనం ఆ పని చేయం.. కానీ ఓ వ్యక్తి మాత్రం 40 ఏళ్లగా..డైలీ ఒక మొక్క నాటుతూనే ఉన్నాడు. ఇప్పుడు పెద్ద అడవినే సృష్టించాడు.
అసోంలోని మజులిలో నివసించే జాదవ్ పాయెంగ్ ఉన్న ప్రదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అంటారు. ఒకప్పుడు ఈ ప్రదేశం పచ్చగా ఉండేది కానీ ఆ తర్వాత మనుషులు ఈ స్థలాన్ని నాశనం చేసేశారు.. అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. 1979లో ఇక్కడ తీవ్ర వరదలు వచ్చి కరువు సంభవించింది.. మాతృభూమిని కాపాడుకోవడానికి, అప్పటికి కేవలం 16 సంవత్సరాల వయస్సు ఉన్న జాదవ్, దానిని మునుపటిలా ఉంచాలని అనుకున్నాడు.. దీనిపై అధికారులను హెచ్చరించేందుకు జాదవ్ పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేదు. ఫలితంగా ఈ ప్రదేశం నిర్మానుష్యంగా మారింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రోజూ ఆ స్థలంలో ఓ చెట్టును నాటాడు.
సుమారు నలభై ఏళ్లుగా ఇదే విధానాన్ని అనుసరించి 1360 ఎకరాల భూమిని సస్యశ్యామలం చేశాడు జాదవ్.. ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతంలో గడ్డి కూడా కనిపించని నిర్మానుష్య ప్రదేశం..కానీ ఇప్పుడు..పచ్చని చెట్ల అడవి. ఒక వ్యక్తి కృషితో మొత్తం అడవిని స్థాపించడం అంటే మామూలు విషయం కాదు… ఇక్కడ పచ్చదనం తిరిగి రావడంతో అడవి జంతువులు ఇక్కడ నివాసం ప్రారంభించాయి. జాదవ్ చెట్లు నాటే పనిని రహస్యంగా చేయడం ప్రారంభించాడు. 2007లో ఓ ఫోటో జర్నలిస్ట్ హఠాత్తుగా ఇక్కడికి చేరుకోవడంతో ఈ అడవి బయటపడింది. జాదవ్‌పై ఫారెస్ట్ మ్యాన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇంట్రస్ట్ ఉంటే చూడండి..