త్వరలోనే సమస్యలు పరిష్కరించి షూటింగ్స్ ప్రారంభిస్తాం – దిల్ రాజు

-

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మీటింగ్ ఈరోజు (గురువారం) భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా నిర్మాతలు అందరూ షూటింగ్స్ ను ఆపేసామని తెలిపారు. మేము 4 పాయింట్స్ పై చర్చిస్తున్నామన్నారు.ఓటిటి కి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీ కి మంచిది అని ఈ విషయంలో ఒక కమిటీ వేసుకున్నామన్నారు.ఆ కమిటీ ఓ టి టి కి సంబంధించి వర్క్ చేస్తుందన్నారు.

రెండవది… థియేటర్స్ లో వి పి ఎఫ్ ఛార్జీలు పర్సెంటెంజ్ లు ఎలా వుండాలి అనేదానిపై ఒక కమిటీ వేసామన్నారు.ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుందన్నారు దిల్ రాజు. మూడవది…. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్ పై కూడా కమిటీ వేశామన్నారు. నాలుగు…. నిర్మాతలకు ప్రొడక్షన్ లో వెస్తేజ్, వర్కింగ్ కండిషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలి అంటే ఏమి చెయ్యాలి దీనికి కూడా కమిటీ వేసామన్నారు.

ఈ నాలుగు పాయింట్స్ మీద ఛాంబర్ అధ్వర్యంలో కమిటీలు వెసాము అవి వర్క్ చేస్తున్నాయన్నారు. కొన్ని సోషల్ మీడియా లో ఏవేవో రాస్తున్నారని..మా అందరికీ ఫిలిం ఛాంబర్ ఫైనల్ అని అన్నారు. మేము నెలల తరబడి షూటింగ్స్ ఆపాలని ఉద్దేశ్యం లేదు కానీ..నిర్మాతకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాస్ట్ మూడు రోజులనుంచి మూడు నాలుగు మీటింగ్స్ అయ్యాయన్నారు. ఈ నాలుగు కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా వుండాలి అనేది వర్క్ చేస్తున్నాము త్వరలో ఆ రిజల్ట్ వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version