కాంగ్రెస్ జోలికి వస్తే పండవెట్టి తొక్కుతాము : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

భువనగిరిలో మాకు పోటీ లేదు.. భువనగిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జోలికి వస్తే పండవెట్టి తొక్కుతామ ని వార్నింగ్ ఇచ్చారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను బొందపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బండకేసి కొట్టాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ లాగా మేం మాటలు చెప్పం..చేసి చూపిస్తామన్నారు కోమటి రెడ్డి . కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ అంటున్నడు.. రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే మాడి మసైపోతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

మా ప్రభుత్వం జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టం అని ,తెలంగాణలో ఉండేది.. ఉండబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news