క్రిస్మస్ నాటికి 27 దేశాల యురోపియన్ కూటమిలో ఉన్న పౌరులకు కరోనా వైరస్ టీకాలను వేస్తామని యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. అయితే సభ్య దేశాలు వందల మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ల తయారీకి సిద్దం కావాలని, తయారి లాజిస్టిక్ చైన్ ని రెడీ చేయాలని పేర్కొన్నారు. యూరోపియన్ సొసైటీ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ చట్ట సభ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
“మొదటి యూరోపియన్ పౌరులకు ఇప్పటికే డిసెంబర్ ముగింపుకు ముందే టీకాలు వేయవచ్చు” అని పేర్కొన్నారు. యునియన్ కి చెందిన ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ అయిన కమిషన్… ఆరు వ్యాక్సిన్ సరఫరాదారులతో ఒప్పందాలు చేసింది. మరో ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తుంది. 800 మిలియన్ మోతాదులకు పైగా కొనుగోలు చేయడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ సుమారుగా 460 మిలియన్ల జనాభా ఉన్నారు.