ఒక్కసారిగా మారిన వాతావ‌ర‌ణం..హైదరాబాద్‌లో భారీ వర్షం

-

హైదరాబాద్‌ మహా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. హైదరాబాద్‌ నగరంలోని.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే… తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ… ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు.

అంతేకాక.. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా మొక్క జోన్న, పత్తి, వరి, పండు మిర్చి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లోనూ భారీ నుంచి వర్షాలు ఉన్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news