పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులు వద్ద వసూలు చేయొచ్చు

-

వివాహ ఖర్చులను తల్లిదండ్రుల నుంచి కూతురు వసూలు చేసుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే భును రామ్ కుమార్తె రాజేశ్వరి అవివాహితురాలు. తన తండ్రికి పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.55లక్షలు వస్తాయని, అందులో నుంచి తన పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.20లక్షలను భిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచే నేరుగా ఇప్పించాలని 2016లో స్థానిక కుటుంబ కోర్టును ఆశ్రియించింది.

అయితే, ఇలాంటి నిబంధన ఏదీ హిందూ దత్తత, నిర్వహణ చట్టంలో లేదని పేర్కొంటూ రాజేశ్వరి పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. ఈ విషయమై హైకోర్టులో అప్పీల్ చేయగా, కుమర్తె పెళ్లి ఖర్చులు కూడా హిందూ చట్టంలో పేర్కొన్న నిర్వహణ పరిధిలోకే వస్తాయని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news