కరోనా కేసులు తగ్గుముఖం.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నెల ప్రారంభం వరకు.. భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. దేశ రాజధాని ఢిల్లీలో కర్ఫ్యూ ఆంక్షలు విధించింది కేజ్రీవాల్ సర్కార్. అయితే… తాజాగా రాజధానిలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అదుపులోకి రావడం తో ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్.

ఈ మేరకు పోలీసులు అలాగే వైద్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్. కాదా దేశ రాజధాని ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 12,306 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే నిన్న ఒక రోజు 13785 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల వ్యవధిలో… రోజువారి కరోనా కేసులు గరిష్టంగా 28 వేల నుంచి భారీగా తగ్గాయి. అటు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇలాంటి తరుణంలోనే కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు ఎత్తి వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news