వావ్.. ఈ ఐస్ ప్యాక్ తో కొవ్వును ఈజీగా కరిగించేయిచ్చుగా..! సైంటిఫిక్ గా తేల్చేశారు

-

ఈరోజుల్లో బాడీలో ఎక్కడంటే అక్కడ కొవ్వు పేరుకుపోయి చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అధిక కొవ్వు కాస్తా.. అధిక బరువుగా మారుతుంది. అయితే కొందరు చూడ్డానికి సన్నగానే ఉంటారు కానీ.. బాడీలో కొన్ని భాగాల్లో అధిక కొవ్వు ఉంటుంది. సన్నగా ఉన్నవారికి కూడా చేతుల్లో, తొడల్లో, సీట్ ఇలా ఏదో ఒక భాగంలో ఫ్యాట్ ఉంటుంది. ఈరోజు మనం ఈ ఫ్యాట్ ను ఈజీగా కరిగిండానికి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన రెండు పద్ధతులను చూద్దాం. ఇందులో మీరు ఏ ఎక్సర్ సైజ్ చేయక్కర్లేదు, ఎలాంటి కషాయాలు తాగక్కర్లేదు. మరి ఏం చేయాలంటే..

కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకుని ఉన్నప్పుడ మనం అది మండిస్తేనే.. కరిగిపోతుంది. అప్పుడే బరువు తగ్గిపోతారు. కొవ్వు కరగాలంటే ఎనర్జీగా మార్చాలి. దానికోసం..ఐస్ ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుందట. నాచురల్ పద్దతితలో బాడీకీ ఐస్ ప్యాక్ పెట్టి.. కప్పేసి ఉంచుతారు. ఆ చల్లదనానికి బాడీలో కొవ్వు కరగటం స్టాట్ అవుతుంది. 15-20 డిగ్రీల టెంపరేచర్ ఉండే కూల్ వాటర్ తీసుకుని మందపాటి టవల్ తో తడిపేసి..
బట్టలు లేకుండా.. బాడీ అంతా చుట్టేసుకోవాలి. దానిపై వేరే టవల్ కూడా చుట్టుకుంటే.. వెంటనే చల్లదనం పోదు. ఇలా ఉంచుకుంటే.. 4 నిమిషాలకు కొవ్వుకణాల్లో మార్పులు వస్తాయి. చిల్లింగ్ ఎఫెక్ట్ కు కొవ్వు కణాల పై ఉండే ఆల్ఫా రిసప్టార్స్( Alfa Receptors) బీటా రిసప్టార్స్ గా (Beta Receptors) మారి..మెటోకాండ్రియాలోకి వెళ్లి ఎనర్జీగా కన్వర్ట్ అయి.. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.

ఇంకా ఈ చల్లదనం వల్ల ఐరిసిన్ ( Irisin) అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది.. ఇది పెద్దసైజు కొవ్వు కణాలను చిన్న సైజు కొవ్వుగా మార్చుతుంది. చిన్న అణువులుగా మారినప్పుడు కొవ్వు కరగటం తేలిక అవుతుంది. రోజు ఒక 20-30 నిమిషాల పాటు ఈ ఐస్ ప్యాక్ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కూల్ వాటర్ తో తడుపుతుండాలి. ఇలా డైలీ చేస్తుంటే తొడలు, చేతులు, పొట్ట భాగాల్లో కొవ్వు కరుగుతుంది. బాడీ మొత్తం లేదా కేవలం చేతుల వరకూ, కేవలం పొట్ట వరకూ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొవ్వు కరుగుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు కూడా. ఈ పద్దతినే కోల్డ్ వెట్ షీట్ ప్యాక్( cold wet sheet pack) అంటారు.

ఇంకో పద్దతి కూడా ఉంది.. గదిలో ఏసీ ఆన్ చేసి 15-20 డిగ్రీల చల్లదనంలో ఉంచి.. లో దుస్తులు తప్ప మిగతావి లేకుండా..డోర్స్ వేసుకుని అలా ఉన్నా..5-10 నిమిషాలకు బాడీ బాగా కూల్ అయిపోయి హీట్ ప్రొడ్యూస్ అవడానికి కొవ్వు కరుగుతుందని కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్, నాచురల్ గా ఇంట్లో చేసుకోవడం వల్ల ఖర్చుకూడా ఉండదు. ఇదే ట్రీట్మెంట్ ను బయట స్పాలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ టెక్నాలజీ ఉపయోగిస్తూ.. చేస్తున్నారు.

లూస్ అయిన స్కిన్ టైట్ అవడానికి కూడా ఐస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. మరీ 0 డిగ్రీల చల్లదనంలో పెడితే.. బాడీలో మంటలు వస్తాయి. 15-20 డిగ్రీల టెంపరేచరల్ నే చేయాలి. బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి..కొవ్వు కరిగిండానికి ఇది చాలా సులువైన ఖర్చులేని మార్గం కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news