ఘోరాతి ఘోరం: పసికూన చేతిలో వెస్ట్ ఇండీస్ “బలి”… సూపర్ ఓవర్ లో ఓటమి !

-

గత మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవాన్ని మరిచిపోక ముందే ఈ రోజు మరో దారుణ ఓటమిని మూటగట్టుకుంది వెస్ట్ ఇండీస్ జట్టు. ఈ ఓటమి మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు. వెస్ట్ ఇండీస్ మరియు నెదర్లాండ్ జట్లు తలపడిన ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో ఎంతో బలమైన వెస్ట్ ఇండీస్ 100 శాతం ఫేవరేట్ అని చెప్పాలి. అందుకు తగిన విధంగానే మొదటి ఇన్నింగ్స్ కొనసాగింది. వెస్ట్ ఇండీస్ నిర్ణీత ఓవర్ లలో 374 పరుగులు చేసింది. నెదర్లాండ్ కెపాసిటిటీ తో పోల్చుకుంటే ఈ స్కోర్ ను సాధించడం కష్టమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఒక్క పరుగు ముందు ఆగిపోయింది. చివరికి మ్యాచ్ కాస్త డ్రా అయింది, కానీ సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చే ప్రక్రియ ఉండడంతో.. మొదట నెదర్లాండ్ బ్యాటింగ్ చేసింది… స్ట్రైకింగ్ లో వాన్ బీక్ ఉండగా… బౌలింగ్ కు హోల్డర్ వచ్చాడు.. వాన్ బీక్ వరుసగా హోల్డర్ ఓవర్ లో 4, 6, 4, 6, 6, 4, కొట్టి 30 పరుగులు పిండుకున్నాడు.

ఇక్కడే వెస్ట్ ఇండీస్ ఓటమై ఖరారు అయింది. అనంతరం 31 పరుగుల టార్గెట్ తో వచ్చిన చార్లెస్ మరియు హోప్ లు తన జట్టును గెలిపించలేక పోయారు. ఆ ఓవర్ లో ఎనిమిది పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీనితో నెదర్లాండ్ చరిత్రత్మకమైన విజయాన్ని అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news