కలలో శివుడు కనపడితే ఏం అవుతుంది..? శుభమేనా..?

-

మనం నిద్రపోయినప్పుడు మనకి కలలో ఎన్నో కనబడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి మంచి కలలు వస్తూ ఉంటాయి. మనం ఉద్యోగాన్ని పొందినట్టు కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కానీ లేకపోతే డబ్బులు సంపాదించినట్లు కానీ ఇలా.. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. కలలో కనుక శివుడు కనపడితే ఏమవుతుంది.. శివుడు కలలో కనపడితే అదృష్టం కలిసి వస్తుందా.. లేకపోతే కష్టాలు వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కొక్కసారి మనకి భయంకరమైన కలలు వస్తాయి నిజానికి అలాంటి కలలు ఎవరికి రాకూడదనిపిస్తుంది. భయపడిపోతూ ఉంటాము కూడా. కలలో శివుడు కనుక కనబడితే ఏం అవుతుంది..? వివిధ రూపాలలో దర్శనమిస్తే వాటి అర్థం ఏంటి..? ఈ విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు విగ్రహం కనబడితే మంచిదే శివలింగాన్ని చూడడం వలన చక్కటి ఫలితాలను పొందవచ్చు. శివుడు ఏ రూపంలో కనపడినా ఎన్నో మార్పులు జీవితంలో చోటు చేసుకుంటాయి. శివలింగానికి జలాభిషేకం చేయడం లేదంటే శివుడుని పూజిస్తున్నట్లు కల లో కనపడితే శుభ ఫలితాలను మీరు పొందుతారు ఒకవేళ కనుక శివుడి శరీరం కనుక కనపడితే చాలా మంచి కలుగుతుంది.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటాయి. అలానే విజయాన్ని మీరు అందుకుంటారు. పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. కలలో శివలింగాన్ని పూజిస్తున్నట్లు మీకు కనబడితే మీ జీవితంలో అడ్డంకుల తొలగిపోతాయి మంచి రోజులు మీకు త్వరలో చోటు చేసుకోబోతున్నాయని దానికి అర్థం. మీ కోరికలు అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయని దానికి సంకేతం. శివలింగానికి పాలాభిషేకం చేసినా తెల్లని రూపంలో శివుడు కనపడినా భవిష్యత్తులో లేదంటే కుటుంబంలో ఎవరైనా తీవ్ర అనారోగ్య సమస్యల నుండి బయటపడచ్చని దానికి అర్థం. కలలో శివుడు కనపడితే దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడే వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news