ప్రెగ్నెన్సీ టైంలో వంకాయ తింటే ఏమవుతుంది? పిండంపై దీనిపై ప్రభావం ఏంత?

-

ప్రెగ్నెస్సీ టైంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మాలనిపిస్తుంది. ఎందుకో ఆ టైంలో చాలా సున్నితంగా, అయోమయంగా ఉంటుంది వారి మెంటాలిటీ. ఎదైనా తినొద్దు అంటే.. ముందు మానేస్తారు.. డాక్టర్ ను కలిసినప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇక అదే క్రమంలో.. కాఫీలు, టీలు, బొప్పాయి తినొద్దని ప్రతి ఒక్కరూ చెప్తారు. వీటికి కారణం ఏదైనా ఉండనీ.. మనం అయితే ముందు పక్కన పెట్టేస్తాం. నిజానికి కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుందని మానేయమంటారు. బొప్పాయ తినడం మంచిదే.. కానీ బాగా పండింది..తగు మోతాదులో తినాలి. అయినా మనకు ఎందుకు వచ్చిన రిస్క్ అని అందరూ ఆ టైంలో బొప్పాయికి దూరంగా ఉంటారు.. మరి ఇదే క్రమంలో కొందరూ వంకాయ కూడా తినొద్దంటారు.. ఈరోజు మనం వంకాయ నిజంగానే తినొద్దా, తింటే ఎంత పరిమాణంలో తినాలో చూద్దాం.

వంకాయ తినడం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన ఇనుము ,అనేక రకాల విటమిన్లనను అందిస్తుంది.. ఇందులో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, సెలీనియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ, బి2, బి6 సి, డి, ఇ, కె మొదలైనవి బోలెడు ఉన్నాయి.

గర్భధారణ సమయంలో వంకాయ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏంటి..?

ఒక నివేదిక ప్రకారం.. గర్భధారణ సమయంలో కూడా వంకాయను తినొచ్చు. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. బెండకాయ తినడం వల్ల పిండం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. అలాగే, వంకాయలో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల పిండంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా వృద్ది చేస్తుంది. గర్భధారణ సమయంలో అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే గర్భిణీలు ఆహారంలో వంకాయను తప్పకుండా చేర్చుకోమని వైద్యులు చెబుతున్నారు.

వంకాయలో విటమిన్ ఎ, ఇ, బి కాంప్లెక్స్, నియాసిన్ సమృద్దిగా ఉండటం వల్ల.. పిండం సక్రమంగా అభివృద్ధి చెందుతుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు సమస్య తరచూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వంకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల అందులో ఉండే.. థయామిన్, బయోఫ్లావనాయిడ్స్, రైబోఫ్లావిన్ రక్తపోటును నియంత్రిస్తాయి.

గర్భిణీ స్త్రీలకు గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వంకాయ తినడం వల్ల చెక్కరస్థాయిలను నియంత్రిస్తుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత సరిగ్గా ఉంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

నష్టాలు ఏంటి..?

ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ.. పరిమితికి మించి తినటం మంచిది కాదు. వంకాయ అనే కాదు..ఏ కూరగాయ అయినా.. మితంగానే తినాలి. వంకాయలను ఎక్కువగా తింటే, అలెర్జీ, దద్దుర్లు, దురదలు సంభవించవచ్చు. గ్యాస్ సమస్య పెరుగుతుంది. . మీకు గ్యాస్ సమస్య ఉంటే, గర్భధారణ సమయంలో వంకాయ తినడం మానుకోండి. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదం ఉంది. అయితే ఇవి కేవలం వంకాయ తినటం వల్ల రావు.. వంకాయతో మసాల వంటలు, పులుసులు చేసుకుని ఎక్కువగా తినడం వల్ల వస్తాయి. లేత వంకాయలతో ఉప్పు, నూనెల తగ్గించి సాప్ట్ గా చేసుకుని తినటం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.

కాబట్టి తగిన మోతాదులో.. ఉప్పు, కారం, మసాలు తగ్గించి వంకాయలను గర్భీణీలు తినొచ్చు. దీని ద్వారా వంకాయలో ఉండే పోషకాలు అన్నీ బాడీకి అందుతాయంటున్నారు..వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news