అప్పులు చేయడం, నిధులు దారి మళ్లించడం తప్ప మీరు ఏం చేశారు: దేవినేని ఉమా

-

పిల్లల సొమ్ములు పీక్కున్నారు అంటూ మీడియాలో వచ్చిన ఓ కథనంపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. అప్పులు చేయడం, పన్నులు బాదడం, నిధులు దారి మళ్ళించడం తప్ప 37 నెలల్లో మీరు ఏం చేశారు? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. పాఠశాలలో కాంపోజిట్ గ్రాండ్ ఖాతాలు ఖాళీ చేయడం వలన వైఫల్యానికి నిదర్శనమని దేవినేని ఉమ విమర్శించారు.

నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ సొమ్ములు లాగేశారని ఆరోపించారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో అమ్మ ఒడిలో కోత పెట్టిన రూ. 879 కోట్లు మాయమయ్యాయి అని వివరించారు. మరోవైపు హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చి ఉంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. సీబీఐతో విచారణ చేయిస్తే అసలు నిజాలు తెలుస్తాయి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news