ఇప్పుడు భారతీయల భవిష్యత్తు ఏంటీ…

-

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ రోజు కూడా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి . ఇప్పుడు పరిస్థితులు అమెరికా భవిష్యత్తుని కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. లాక్ డౌన్ ని కూడా సడలించే పరిస్థితి ఎక్కడా కూడా కనపడటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు.

ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పౌరుల ఉద్యోగాలను కాపాడుకోవడానికి గానూ ఆయన ఇమ్మిగ్రేషన్ ని రద్దు చేసారు. దీనిపై త్వరలోనే ఆయన సంతకం చేస్తారు. ఇక అక్కడి కంపెనీలు కూడా నష్టాలను ఎదుర్కోలేక భారీగా ఉద్యోగులను తొలగించే సూచనలు కూడా కనపడుతున్నాయి. అమెరికా సర్కార్ ఇప్పుడు దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. వీరిలో ఎక్కువ జీతాలకు పని చేసే అమెరికా సంతతి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. విదేశీయులు తక్కువ జీతాలకు చేయడంతో వాళ్ళు ఎక్కువగా మన దేశం, సహా శ్రీలంక, పాకిస్తాన్ వాళ్ళను తీసుకుంటూ ఉంటారు. కీలక ఐటి కంపెనీల్లో మన వాళ్ళు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రాల నుంచి భారీగా ఉద్యోగులు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు. ఇక లక్షలు పోసి చదివి విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలి అనుకునే వాళ్లకు కూడా ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ఇబ్బందికరంగా మారే సూచనలు కనపడుతున్నాయి. మరి మన వాళ్ళ భవిష్యత్తు ఏంటీ అనేది చూడాలి. అమెరికా అభివృద్దిలో మన వాళ్ళ పాత్ర చాలా కీలకం. ఆదాయంలో కూడా మన వాళ్ళ భాగం కీలకంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news