జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు రెమ్యునరేషన్ ఎంతంటే..?

-

కన్నడ ఇండస్ట్రీ ద్వారా పరిచయమైన సౌమ్యారావు ఇటీవల శ్రీమంతుడు సీరియల్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే మనసు మాట వినదు సీరియల్ లో కూడా సత్య పాత్రలో నెగిటివ్ పాత్ర పోషిస్తూ మరింత ఫాలోవర్స్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈమె గురించే చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. సౌమ్య రావు కన్నడ, తమిళ్ సీరియల్స్ లో భారీగా పాపులారిటీని దక్కించుకుంది. అలా తెలుగు బుల్లితెర ఈటీవీ సీరియల్స్ లో కూడా అవకాశం దక్కించుకొని ప్రస్తుతం జబర్దస్త్ లో యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీరియల్స్ నుంచి వచ్చింది కదా ఈమెకు ఎంత పారితోషకం ఇస్తున్నారు అనే వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.85 వేల రూపాయల చొప్పున పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఈమె వల్ల జబర్దస్త్ షో రేటింగ్ పెరిగితే ఈమె పారితోషకం కూడా పెరిగే అవకాశం ఉందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అందం విషయంలో అనసూయ , రష్మీ లతో పోటీపడే ఈ ముద్దుగుమ్మ తప్పకుండా వీరిద్దరిని మించి మెప్పించడం గ్యారెంటీ అంటూ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

సౌమ్యరావుకు సీరియల్స్ ద్వారా లభించని క్రేజ్ ఈ షో ద్వారా బాగా లభిస్తుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమెకు ఈ షో వల్ల సినిమాలో ఆఫర్లు వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొంతమంది నెటిజన్ లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జబర్దస్త్ లోకి వచ్చింది కాబట్టి ఈమె దశ తిరిగినట్టే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news