లాక్ డౌన్ పై జగన్ నిర్ణయం ఏంటీ…?

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడిలో ఉందని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితులు మాత్రం ఆ విధంగా లేవు అనేది అర్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కంటే ఏపీలో ఏమీ తక్కువగా లేవు. వారం రోజుల్లో 300 మార్క్ దాటి ఇప్పుడు 400 మార్క్ వైపుగా పరిస్థితులు వెళ్తున్నాయి. దీనిపై ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. ఏపీ సర్కార్ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో లాక్ డౌన్ విషయంలో జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది స్పష్టత రావడం లేదు.

ఉత్తరాంధ్రలో ఆ పార్టీ కీలక నేత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. లాక్ డౌన్ పై ముందుకి వెళ్ళే ఉద్దేశం జగన్ కి లేదని అన్నారు. ఆ ఉద్దేశం జగన్ కి లేకపోతే పరిస్థితి చేయి దాటిపోవడం ఖాయం. ఇప్పటికే అధికారుల బదిలీ విషయంలో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో గనుక ఏదైనా తేడా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది రావడం ఖాయమని అంటున్నారు. లాక్ డౌన్ పై ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా తమ నిర్ణయాలు చెప్తున్నాయి. కేంద్రం తో సంబంధం లేకుండా…

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణా, ఓడిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపి ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనితో ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసులు తగ్గుతున్నాయి కాబట్టి పాక్షికంగా లాక్ డౌన్ ని సడలించే యోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. అది జరిగితే ఇబ్బంది వస్తుంది. అయితే ప్రధాని మోడీ మాత్రం లాక్ డౌన్ ని కొనసాగించాలి అనే భావిస్తున్నారు. మరి దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news