వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు ఇళ్లల్లో ఎలాంటి వాటిని ఉంచకూడదు అనేది చెప్పారు. మరి మనం ఏవి ఉంచకూడదు అనే దాని కోసం చూసేద్దాం.
ఇంట్లో ఇలాంటి మొక్కల్ని నాటకండి:
ఇంట్లో ముళ్ళ మొక్కల్ని నాటడం వలన సమస్యలు వస్తాయి. నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కాబట్టి కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో నాటకండి.
మునిగిపోతున్న షిప్ ఇంట్లో ఉండకూడదు:
చాలామంది అందమైన సీనరీలను పెడుతూ ఉంటారు కొంతమంది మునిగిపోతున్న షిప్ సీనరీని కూడా పెడతారు. దీనిని పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ కలిపి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కాబట్టి వీటిని కూడా అసలు పెట్టకండి.
క్రూర మృగాలు:
ఇంట్లో క్రూర మృగాల ఫోటోలని పెట్టడం కూడా మంచిది కాదు. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ ని దూరం చేసి నెగటివ్ ఎనర్జీ కలిగిస్తుంది.
విరిగిపోయిన విగ్రహాలు:
ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎప్పుడు విరిగిపోకూడదు. మంచి అందమైన దేవుడి ఫోటోలు మాత్రమే ఉంచుకోండి.
ఇంటి డోర్ బెల్:
ఇంటి డోర్ బెల్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి భయంకరమైన శబ్దాలు చేసేది ఏమాత్రము ఉంచకండి.
విరిగిపోయిన గచ్చు:
ఇంట్లో విరిగిపోయిన గచ్చు కూడా ఉండకూడదు. ఎప్పుడైనా గచ్చు విరిగిపోతే వెంటనే రిపేర్ చేయించుకోండి. చూశారు కదా వాస్తు పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని ఫాలో అయ్యి మంచిగా ఆనందంగా ఉండండి లేకపోతే సమస్యలు తప్పవు.