ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌లను నిరంతరం అందిస్తూనే ఉంటుంది. తాజాగా వాట్సాప్ మరో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు తెసులకుందాం. మనం రికార్డు చేసిన తర్వాత విని ఆ మెసేజ్‌లో ఏమైన మార్పులు ఉంటే ఆ రికార్డు డిలిట్ చేసుకొనేలా కొత్త ఫీచర్‌ను వాట్సప్ ప్రవేశ పెడుతుంది. దీంతో ఇతర మెసేజింగ్ యాప్‌లకు గట్టి పోటీ నిస్తోంది వాట్సాప్.
ఈ ఫీచర్ యూజర్ల మధ్య మెరుగైన నాణ్యమైన సమాచారా మార్పిడీకి ఉపయుక్తంగా ఉంటుందని వాట్సప్ తెలిపింది. మనం గతంలో వాయిస్ మెసేజ్ పంపితే ఒక స్ట్రైట్ లై న్ మీద డాట్ కదులుతూ వాయిస్ వినిపిస్తుంది. ఇక మీద వచ్చే ఫీచర్‌లో ఆడియో వేవ్‌లు దర్శనమిస్తాయి. ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి తెస్తామని వాట్సప్ బీటా ఇన్ఫో వాట్సప్ కమ్యూనిటీ బ్లాగ్‌లో ప్రకటించింది.
ఈ ఫీచర్‌తో పాటు అదనంగా వాయిస్ మెసేజ్ ఇంటర్‌ఫేస్ లో కూడా మార్పులు చేస్తున్నట్టు తెలిపింది.ఈ ఫీచర్‌తోపాటు మెసేజ్ రియాక్ష న్ , కలర్ స్కీమ్, వెబ్ ప్రివ్యూ, డేటా ట్రాన్స్ ఫర్, స్టేటస్ ట్యాబ్ వంటి ఎన్నో ఫీచర్‌లు వాట్సప్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఈ ఫీచర్‌లు అన్ని ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వాట్సాప్‌లో కూడా ఇన్‌స్టాగ్రాం మాదిరి స్టోరీస్ రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా మనం చాట్ ను ఎలా హైడ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. వాట్సాప్ వ్యూ వన్స్ ఆప్షన్‌ను కూడా వాట్సాప్ పరిచయం చేసింది. దీంతో స్టోరేజీ ఆదా అవుతుంది.