ఇన్‌స్టాగ్రాంలో ‘లిమిట్‌’ ఫీచర్‌ను యాక్టీవ్‌ చేసుకోండి!

ఇన్‌స్ట్రాగామ్‌ లిమిట్‌ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు కామెంట్లను, మెసేజ్‌లను నియంత్రించ వచ్చు. ఇన్‌ స్ట్రాగామ్‌లో యూజర్లు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య అసభ్య కామెంట్లు.. నేరుగా తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్‌లు. వీటి ద్వారా యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీచర్‌తో వాటికి చెక్‌ పెట్టవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram
ఇన్‌స్ట్రాగామ్‌ | Instagram

వినయోగదారుల రక్షణ కోసమే లిమిట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇన్‌స్ట్రాగామ్‌లో దూషణలు, ద్వేషపూరితమైన వాఖ్యలు సహించమని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి కామెంట్లు చేస్తే కచ్చితంగా వాటిని తీసివేస్తామన్నారు. యూజర్ల కోసం ప్రత్యేకంగా లిమిట్‌ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఇన్‌స్ట్రాగామ్‌ వాడే సంఖ్య సుమారు 120 మిలియన్‌ లు ఉన్నారు.

  • ఈ ఫీచర్‌ను ఈజీగా వినియోగించవచ్చు. లిమిట్‌ను ఆన్‌ చేస్తే పరిమితమైన కామెంట్‌లు, రిక్వెస్టులు మాత్రమే వస్తాయి.
  • ఎవరైన యూజర్‌ ఇన్‌ స్ట్రాగామ్‌ ప్రైవసీ సెట్టింగ్‌లో లిమిట్‌ ఆప్షన్‌ ను ఆన్‌ చేసుకుంటే ముందుగా మిషన్‌ లర్నింగ్‌ పద్ధతి ద్వారా ఆ వినియోగదారులకు ఎవరూ నేరుగా మెసేజ్‌ చెయ్యలేరు. కామెంట్లు కూడా అనుమతితోనే చేయడం కుదురుతుంది.
  • అంతే కాకుండా మీరు ఫాలో అవ్వని వారి నుంచి ఎలాంటి అసభ్య కరమైన కామెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌లో మరో సౌలభ్యం కూడా ఉంది. ఎవరైన ఉద్దేశ పూర్వకంగా పదే పదే అసభ్య సందేశాలు పంపుతున్నా.. కామెట్లు చేస్తున్న వారి కామెట్లను హైడ్‌ చేయచ్చు. హైడ్‌ చేసిన తర్వాత కూడా అలానే కామెంట్లు కొనసాగితే వారి కామెంట్లు డిలిట్‌ చేయడంతో పాటు హైడ్‌ చేయవచ్చు.