కేజ్రీవాల్ ను చూస్తే.. ప్రజలకు మద్యం కుంభకోణం గుర్తుకొస్తుంది : అమిత్ షా

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కేజ్రీవాల్  ను ఎన్నికల ప్రచారంలో చూసినప్పుడు ప్రజలకు మద్యం కుంభకోణం గుర్తుకు వస్తుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కేజీవాల్ ఢిల్లీ, పంజాబ్ సహా ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు ఆయనను చూసినప్పుడు వారికి ముందుగా పెద్ద మద్యం సీసాలు కనిపిస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. ప్రచారం చేయడానికి కేజీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆయన అన్నారు.

ఎన్నికల కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఆప్, కేజ్రీవాల్ గొప్ప విజయంగా భావించవద్దని..  ఆప్ కి ఓటు వేస్తే మళ్లీ జైలుకు వెళ్లకుండా చూస్తామని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సందేశాన్ని పంపిస్తాయని అమిల్షా అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, గెలుపు ఓటములను బట్టి నేరాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా.. ఇది సుప్రీంకోర్టు పనితీరుపై తప్పుడు వ్యాఖ్య అవుతుందని షా తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన కేజీవాల్కు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న మధ్యంతర బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం నాలుగు దశల పోలింగ్ ముగిసింది. ఢిల్లీలోని ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news