విలన్ లేకుంటే హీరో ఎక్కడినుండి వస్తాడు? సంజయ్ దత్..

-

సౌత్ సినిమాపై సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కే జి ఎఫ్ 2 లో అధీరా గా మెప్పించిన ఈ విలన్ తన పాత్ర కోసం ఎంతో శ్రమించిన విషయం తెలిసిందే.యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది.అటు బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజూ బాయ్ దక్షిణాది సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.దక్షిణాది పరిశ్రమ హీరోయిజాన్ని మరువదు.ఇప్పటికీ అక్కడ హీరో ఎంట్రీ సీన్లో గాల్లో దుమ్ము రేగాల్సిందే.థియేటర్లో విజిల్స్ పడాల్సిందే.

ఒకప్పుడు బాలీవుడ్ లోనూ ఎలివేషన్ సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది.మనం మరిచిపోయినమనం మరచిపోయిన సౌత్ సినిమాల్లో ఇప్పటికీ అదే కొనసాగుతోంది.త్వరలో మన దగ్గరా ఇలాంటి సినిమాలు వస్తాయి.అదే సమయంలో విలనిజానికి వారు అంతే ప్రాధాన్యం ఇస్తారు.హీరో అయినా విలన్ అయిన ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోవాలి అని కోరుకుంటారు.గతంలో అమ్రీష్ పురి ఇలాంటి గొప్ప నటులు ప్రతినాయకుడి ప్రాధాన్యాన్ని తెలియజేశాయి.ఓ “జానక్ బాజీ” ఓ “కల్ నాయక్” ఇలా అప్పటి సినిమాలు చూసుకుంటే పరిచయ సన్నివేశాలను బలంగా చూపించేవారు.సినిమాకు అది ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను.హాలీవుడ్ లోనూ యాక్షన్, సస్పెన్స్ఇలా జానర్ ఏదైనా శక్తివంతమైన విలన్ ఉంటాడు.విలన్ లేకుంటే హీరో ఎక్కడి నుంచి వస్తాడు? అంటూ ఈ స్టార్ నటుడు తన మనస్సులో మాట బయట పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news