భారత్‌లో ఏది టాప్ బ్యాంక్..?.. మొదటి 10 స్థానలలో ఏ బ్యాంకు ఉందో తెలుసా..?

-

దేశంలో అనేక బ్యాంకులు ఉన్నాయి. అయితే వీటిల్లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏస్ ఈక్విటీ అనే ఒక సంస్థ భారతదేశంలోని టాప్ 10 బ్యాంకులు ఏవో తెలిపింది. ఈ సంస్థ గత ఏడాది కాలంలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్ ప్రాతిపదికన కింద టాప్ 10 బ్యాంకుల జాబితాను రూపొందించింది. మరీ ఏ బ్యాంకు ఏ స్థానంలో ఉందొ చూద్దామా.

అగ్రస్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొనసాగుతోంది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6,73,736 కోట్లుగా ఉంది. పోయిన ఏడాది కాలంలో HDFC బ్యాంకు సహా లిస్ట్‌ లో ఉన్న ప్రతి బ్యాంక్ మార్కెట్ క్యాప్ తగ్గింది. ఇక రెండో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది. ఈ ప్రైవేట్ రంగ ఐసీసీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 2,85,904 కోట్లుగా ఉంది. మూడో స్థానంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 2,70,949 కోట్లు. అలాగే నాలుగో స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1,18,170 కోట్లు. అయితే ఉద్యోగులు, బ్రాంచులు, ఏటీఎంలు, అసెట్స్ వంటి వాటి ప్రకారం చూస్తే ఇదే అతిపెద్ద బ్యాంక్. ఆ తర్వాత ఐదో స్థానంలో యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంది.

ఇక ఆరవ స్థానంలో బంధన్ బ్యాంక్ నిలిచింది. తక్కువ కాలంలో ఈ బ్యాంకు టాప్‌ లో చోటు సంపాదించుకుంది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.51 వేల కోట్లకు పైనే ఉంది. ఇక ఏడో స్థానంలో ఇండస్ ఇండ్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.47 వేల కోట్లకు పైనే ఉంది. ఇక ఎనిమిదో స్థానంలో ఐడీబీఐ బ్యాంక్ కూడా ప్రైవేట్ రంగ బ్యాంక్. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.39 వేల కోట్లకు పైగా ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో యస్ బ్యాంక్ నిలిచింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 32 వేల కోట్లకు పైనే ఉంది. ఇక చివరగా 10 వ స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. దీని మార్కెట్ క్యాప్ రూ.25 వేల కోట్లు.

Read more RELATED
Recommended to you

Latest news