RRR, KGF-2.. రికార్టులను బ్రహ్మాస్త్రం బద్దలు కొట్టిందా?

-

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్రం వీకెండ్‌ వరకూ వసూళ్లు బాగానే ఉన్నా… ఆ తర్వాత నుంచి కలెక్షన్‌లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫస్ట్‌ వీకెండ్‌లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం ఏదంటూ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌2, బ్రహ్మాస్త్రం చిత్రాల కలెక్షన్లు పోల్చి చూస్తున్నారు. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం.. ‘బ్రహ్మాస్త్రం’ వీకెండ్‌ కలెక్షన్‌ మొత్తం రూ.205కోట్ల వసూలు చేసింది. మరి కేజీయఫ్‌2, ఆర్‌ఆర్‌ఆర్‌ల పరిస్థితి ఏంటి?

ఈ ఏడాది ఆర్​ఆర్​ఆర్​, కేజీయఫ్​ 2, బ్రహ్మాస్త్రం.. భారీ బడ్జెట్​ సినిమాలుగా రిలీజై బాక్సాఫీస్​ ముందు అదరగొట్టాయి. సూపర్​హిట్​ టాక్​ను తెచ్చుకున్నాయి. అయితే అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్రం’ వీకెండ్‌ వరకూ వసూళ్లు బాగానే ఉన్నా, ఆ తర్వాత నుంచి కలెక్షన్‌ల జోరు కాస్త తగ్గింది.

ఈ క్రమంలో ఈ ఏడాది ఫస్ట్‌ వీకెండ్‌లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం ఏదంటూ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌2, ‘బ్రహ్మాస్త్రం’ చిత్రాల కలెక్షన్లు పోల్చి చూస్తున్నారు. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం.. ‘బ్రహ్మాస్త్రం’ వీకెండ్‌ కలెక్షన్‌ మొత్తం రూ.205కోట్ల(ఇండియా – 141కోట్లు, ఓవర్సీస్‌- రూ. 64 కోట్లు) వసూలు చేసింది. మరి కేజీయఫ్‌2, ఆర్‌ఆర్‌ఆర్‌ల పరిస్థితి ఏంటి?

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘కేజీయఫ్‌2’. తొలి వారం ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి( రూ.193కోట్లుఇండియా + ఓవర్సీస్‌) వసూలు చేసింది. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాాగంపై భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్‌ అద్భుతంగా వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్ఆర్ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా ఇది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడం, ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాకు మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా తొలి వీకెండ్‌కు కేవలం హిందీ వెర్షన్‌ రూ.75.57 కోట్లు వసూలు చేయగా మొత్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news