బౌన్స్ బ్యాక్: విశాఖ – విజయవాడ… రాజధానికి ఏది సేఫ్?

-

కొంతమంది ఏ విషయానైనా రాజకీయ రంగు పులిమి మాట్లాడాలనుకుంటారు. జరిగిన ప్రతీ విషయాన్ని వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు. అందులో భాగంగానే ఏపీ పరిపాలనా రాజధాని అమారవతి నుంచి విశాఖకు తీసుకెళ్లడానికి జగన్ ప్రయత్నించినప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అందులో మరి దారుణంగా… విశాఖలో ప్రమాధాలు జరుగుతున్నాయి, విశాఖ సేఫ్ ప్లేస్ కాదు అనేవరకూ వారి రాజకీయాలు చేరుకున్నాయి! అయితే… తాజాగా బెజవాడలో జరిగింది ఏమిటి మరి?

ప్రమాధాలు అనేవి మానవ నిర్లక్ష్యం వల్ల జరిగేవి కొన్నుంటే.. ప్రకృతి ప్రకోపం వల్ల జరిగేవి మరికొన్నుంటే.. దురదృష్టవశాత్తు జరిగేవి ఇంకొన్ని ఉంటాయి. ఈ క్రమంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారం విశాఖలో జరిగింది.. అనంతరం మరో రెండు దుర్ఘటనలు జరిగాయి. వాటిని ప్రమాధాలుగ అర్ధం చేసుకోలేని కొందరు… విశాఖ క్షేమం కాదు అనేవరకూ మాటలు పొడిగించారు. రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలని భావించిన కొందరు పెద్దలు… ప్రశాంతమైన విశాఖకు కళంకాన్ని అంటించే పనికి పూనుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా విజయవాడలో ప్రమాధం జరిగింది. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా అగ్నిప్ర‌మాదం జరిగిందని, ఈ ప్రమాధంలో సుమారు 10 మంది మరణించారని చెబుతున్నారు అధికారులు! విజ్ఞత కలిగిన పెద్దలు అంతా… అయ్యే పాపం అన్నారు.. ప్రమాధంపై విచారణ జరపాలని కోరుకున్నారు. అంతే కానీ… విజయవాడ సేఫ్ కాదు – ఆ పరిశరాల్లోని అమరావతి క్షేమకరమైన ప్రదేశం కాదు అని రంకెలు వేయలేదు! సపోజ్.. ఫర్ సపోజ్… ఇదే ప్రమాధం విశాఖలో జరిగి ఉంటే… కొందరు పెద్దల మాటలు ఏ రేంజ్ లో ఉండేవో అర్ధం చేసుకోవచ్చు!

ఏదేమైనా ఈ ప్ర‌మాదం విచార‌కరం.. బాదాకరం! అంతమాత్రాన్న విజయవాడ సేఫ్ సిటీ కాదని అనకూడదు. ఇదే క్రమంలో మొన్నటివరకూ విశాఖలో జరిగిన ప్రమాధాల వల్ల ఆ ప్రాంతానికి కళంకం అంటించకూడదు. ప్రమాధాలను ప్రమాధాలుగా మాత్రమే చూడాలి.. అందులో మానవతప్పిదాలు ఉంటే… చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో జగన్ సర్కార్ ఇప్పటికే చేతల్లో చూపించింది!

Read more RELATED
Recommended to you

Latest news