ప్రపంచ దేశాలను భాయందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,384 కరోనా పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ అని తేలింది. హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,02,379 మంది కరోనా బారినపడగా, వారిలో 7,93,521 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4,747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థర్డ్ వేవ్‌ను ఎదుర్కున్నట్లు ఫోర్త్ వేవ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కుంటామని వెల్లడించాయి.