గాంధీ కుటుంబం నుంచి గాంధీ కుటుంబం వరకూ కాంగ్రెస్ రాజకీయాలకు అనేక అవరోధాలున్నాయి. రాజకీయం ఎలా ఉన్నా ఇప్పుడున్న స్థితిగతుల్లో నెగ్గుకు రావడం చాలా కష్టం. మోడీలాంటి ధీశాలిని ఢీకొనడంతో కొత్త నిర్వచనం గెలుపునకు దక్కించిన వారు అవుతారు ప్రియాంక. కానీ ప్రియాంక అందుకు సిద్ధంగా ఉన్నారా? సైకాలజీ చదువుకున్న ప్రియాంకకు ప్రజల నాడి అందుతుందా ?
- నాన్నమ్మ ఇందిరాగాంధిని పోలిన రూపం, పోలిన వ్యక్తిత్వం అవునో కాదో తెలియదు కానీ పార్టీకి ఇవాళ ఆమె కొత్త ఆశ అని చెప్పడం తప్పు కాదు.ఆ మాటకు వస్తే ప్రియాంక అనే అమ్మాయి సాధించాలనుకుంటున్నవన్నీ నాన్నమ్మ నుంచి నాన్న నుంచి పొందినవే అయి ఉంటాయి. రాజీవ్ గాంధీ వారసురాలిగా యూపీ ప్రజలు ఆమెను స్వీకరించడం అన్న ఓ కారణంతో ఫలితాలు మారవచ్చు. యోగీ కూడా ఇప్పుడు పెద్దగా రాణించడం అన్నది సాధ్యం కాకపోతేనే ప్రియాంక సీఎంకాగలను అనుకోవాలి. కానీ ఆ సీన్ అక్కడ లేదు.
2. ప్రియాంక గాంధీని ఉద్దేశించి ఆడ పిల్ల అని పట్టి పట్టి చెప్పకండి. ఆమెకు కోపం వస్తుంది. నేను ఆడపిల్లనే కానీ పోరాడగలను అని ధీమా వ్యక్తం చేయడంలో ఆమె ముందుంటున్నారు. రాజకీయంలో ధీమా కూడా మంచిదే! గౌరవ ప్రపత్తులతో పాటు ఏదయినా చేయగలను అన్న ధీమా ఉండడం అమ్మాయిలకు అవసరం కనుక ఆ గుణం ఆమెకు శ్రీరామరక్ష కావచ్చు.
3. బుద్ధుడ్ని ఆరాధిస్తారు ప్రియాంక. ఆమె నమ్మే మతం కూడా ఇదే. కనుక స్థిత ప్రజ్ఞత అన్నది ఆమె పొంది ఉంటారు అని అనుకోవాలి. రాబోవు కాలంలో ఆమె సీఎం అయినా కాకపోయినా ఆమె లోపలి స్థిత ప్రజ్ఞతకారణంగానే ముందున్న కాలంలో కాంగ్రెస్ రాజకీయాల్లో రాణించగలరు. ఎవ్వరికైనా సవాలు రాజకీయాల నుంచి ఒడ్డెక్కడం కాదు కాంగ్రెస్ రాజకీయాల నుంచి ఎంతో కొంత నేర్చుకుని ఒడ్డున పడడం.
4. సముద్రంలాంటి గాంధీ కుటుంబంలో ఇందిరా, రాజీవ్, సోనియాలు ఓ ఏలుబడి ఏలి ఉన్నారు. మళ్లీ స్థానిక ఉత్తరాది ప్రజలు ఆమెను ఎందుకు ఎన్నుకోవాలి. యోగీ చేసినంత మంచి ప్రియాంక చేస్తారని ఉత్తరాదివారు విశ్వసించడం అన్నది జరగని పని.
ఆ మాటకు వస్తే యోగీ కూడా కొన్ని తప్పు పనులు చేశారు. కానీ ధీరత్వం ఉన్న అమ్మాయి అయిన కారణంగా సోనియాను మించిన ఛార్మింగ్ ఉన్న నేతగా ప్రియాంక బలమయిన పురుష నాయకత్వాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటానని చెప్పడం మంచి విషయమే! అమ్మాయిలకు రాజకీయం తో పాటు తెలివితో కూడిన ప్రతిపాదనలు చేయడం కూడా అలవాటు అయితే ప్రియాంక లాంటి నాయకులు రేపటి వేళ జనామోదం పొందేందుకే ఆస్కారం ఎక్కువ.
ఆ పని ఆమె మరియు ఆమె కుటుంబం కూడా మునిగి తేలితే కొన్ని మంచి ఫలితాలు కాంగ్రెస్ కు వస్తాయి. ఆమెకు సీఎం పదవి అనే ఓ కాంక్ష ఇప్పట్లో ఉన్నంతగా రేపటి వేళ ఉండకపోతేనే మేలు. అప్పుడు బుద్ధిజం ఆచరిస్తున్నందుకు ఆమెకో విలువ కూడా! దేనిపైనో కోరిక ఎందుకు ప్రియాంక! కాగల కార్యాన్ని కాంగిరేసు తీర్చదు తల్లీ!
– ఛాయా చిత్ర కథంబం, మన లోకం ప్రత్యేకం