Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రోజులు గడిచిన కొద్దీ షో మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటివరకూ ఐదు వారాలు విజయవంతంగా కాంప్లీట్ చేసుకుని ఆరోవారంలో అడుగుపెట్టింది బిగ్ బాస్. ఈ వారం కెప్టెన్ ని ఎన్నుకోవడంలో భాగం ఇచ్చిన బొమ్మల తయారీ టాస్క్ చాలా మాజాని అందిస్తుంది. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లందరినీ నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టి.. ఇద్దరిని సంచాలకులుగా నియమించారు.
ఈ టాస్క్‌లో మాటాల తూటాలు పేలుతున్నాయి. చిన్న పాటి యుద్దాలే జరుగుతున్నాయి. ఈ తరుణంలో సంచాలకులు సరిగ్గా పర్యవేక్షణ చేస్తాలేరా? తమకు నచ్చిన వారికి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. సంచాలకుల పై గ్రూప్ సభ్యులు మాటాల యుద్దం చేశారు. ఈ క్రమంలో కాజల్, సిరి మధ్య వాగ్విదం జరిగినట్టు కనిపిస్తుంది నేటి ప్రోమోలో చూపించారు. లోబో, రవిలు కూడా సంచాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ తరుణంలో బిగ్ బాస్ సిరియస్ అనౌన్స్ మెంట్ చేశాడు. బాస్ హౌస్ లో పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమావళిని అతిక్రమించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంచాలకులుగా వ్యవహరిస్తున్నా.. కాజల్, సిరిలతో పాటు మానస్ కూడా బాధపడటం అనేది ప్రోమోలో చూపించారు. దీన్ని బట్టీ చూస్తుంటే.. లోబో, శ్వేతలు చేసిన పనికి బిగ్ బాస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది.
నిన్నటి ఎపిసోడ్ లో శ్వేత – లోబో ఇద్దరూ కూడా బెడ్ రూమ్ లో ఉన్నపిల్లో ల నుంచి కాటన్ తీసి కొన్ని బొమ్మలని కుట్టారు. వీరు చేసిన పనిని ఈ టాస్క్ సంచాలకులు కూడా అసలు చూడలేదు. అందుకే బిగ్ బాస్ గ్రీన్ టీమ్ ని అనర్హులుగా ప్రకటించినట్లుగా అర్ధం అవుతోంది. ఈ టాస్క్ సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ లను కూడా కెప్టెన్సీ పోటీదారుల నుంచీ తొలగించినట్లుగా తెలుస్తోంది.
అందుకే రెడ్ టీమ్ నుంచీ శ్రీరామ్ చంద్ర, విశ్వ, ప్రియా అలాగే బ్లూటీమ్ నుంచీ మానస్, సన్నీ, అనీమాస్టర్ లు టాస్క్ లో విన్ అయ్యినట్టు తెలుస్తుంది. అయితే .. ఈ ఆరుగురిలో ఎంతమంది కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నారో? దానికి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చాడనేది తెలియాల్సి ఉంది.
అయితే.. బిగ్ బాస్ ఫాలోయర్స్ మాత్రం ఈవారం హౌస్ కి కొత్త కెప్టెన్ గా విశ్వ ఎంపిక అవుతాడేమనని ఆశభావం వ్యక్తంచేస్తున్నారు. అదే జరిగితే విశ్వ రెండోసారి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినట్లుగా అవుతుంది. అయితే విశ్వ ఈవారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ కెప్టెన్ అయితే సేవ్ చేస్తారా లేదా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి.