రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి..? కారణం ఇదే..!

-

చాలామంది రెగ్యులర్ గా ట్రైన్ లో వెళ్తుంటారు ట్రైన్ లో ట్రావెల్ చేస్తే ఎంతో బాగుంటుంది రైలు లో మీరు గమనించినట్లయితే సీట్లు అన్నీ కూడా నీలం రంగులో ఉంటాయి. అయితే మనకి చాలా రంగులు ఉన్నాయి కదా ఎందుకు నీలం రంగుని మాత్రమే ఉపయోగిస్తారు…? ఎరుపు రంగు లేదంటే పింక్ కలర్ ని వాడొచ్చు కదా ఎందుకు నీలం రంగునే వాడతారు దాని వెనక కారణమేమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

ప్రయాణం అంటే చాలు అందరికీ హడావిడిగా ఉంటుంది. టైం కి రీచ్ అవ్వాలని ట్రైన్ మిస్ అవ్వకూడదని ఇలా ఎంతో కంగారు ఉంటుంది. దీని వలన ఒత్తిడికి గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే బస్సులో కానీ ట్రైన్ లో కానీ సీట్లు అన్నీ కూడా నీలం రంగులో ఉంటాయి. ఇలా ఉండడం వలన రిలాక్సేషన్ కలుగుతుంది.

ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. బస్సు లోపల ఉండే సీట్లు ట్రైన్ లోపల ఉండే సీట్లు ఈ కారణంగానే నీలం రంగులో ఉంచుతారు. టోక్యో నగరంలో అయితే వీధి దీపాలని ఏకంగా నీలం రంగు లోకి మార్చారు అక్కడ నేరాలు కూడా దాదాపు తగ్గిపోయాయి ఇలా నీలం రంగు వల్ల ఇంత బెనిఫిట్ ఉంది కనుక ట్రైన్ లో సీట్లన్నీ కూడా నీలం రంగులో ఉంటాయి. అంతేకానీ ఏ రంగు దొరకక ఈ రంగు వేయలేదు. దీని వలన ఉపయోగం ఉంది కనుక ఈ రంగులో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news