ఆపరేషన్స్ తర్వాతా బరువు ఎందుకు పెరుగుతారు..?

-

చాలామంది ఏదైనా ఆపరేషన్లు జరిగాక విపరీతంగా బరువు పెరుగుతారు. దీనికి కారణం.. ఆపరేషన్ కారణంగా.. బాడీకీ బాగా రెస్ట్ ఇవ్వడమే అనుకుంటారు.. కానీ వేరే రీజన్స్ చాలా ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత.. వైద్యులు కోలుకోవడానికి కొన్ని మందులను సూచిస్తారు. ఈ మందులు తిరిగి బలం, శక్తిని పొందడానికి పనిచేస్తాయి. ఇవి జీవక్రియ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో బరువు పెరగడానికి కారణమవుతాయి. ఇంకా ఎలాంటి కారణాలు ఉంటాయి, ఆపరేషన్ తర్వాత కూడా బరువును తగ్గించుకునే మార్గాలు చూద్దాం.

ఆపరేషన్‌ వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీని కారణంగా హార్మోన్లలో అసమతుల్యత పెరుగుతుంది. శరీరంపై విపరీతంగా ఒత్తిడి మొదలవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా అడ్రినల్ గ్రంధిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని కారణంగా ఇది ఎక్కువ కార్టిసాల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కార్టిసాల్, యాంటీ-డ్యూరెటిక్ హార్మోన్ పెరగడం వల్ల బరువు బాగా పెరుగుతారు.

ఆపరేషన్ తర్వాత బరువు తగ్గాలంటే ఏం చేయాలి..?

వాస్తవానికి శరీరానికి శక్తిని అందించడంలో ప్రోటీన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఆపరేషన్ తర్వాత.. గుడ్లు, చేపలు, పప్పులు మొదలైనవాటిని తినాలి. కూరగాయలు, పండ్లలో నీరు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది బరువు పెరగకుండా సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ తొలగిపోతాయి. బరువుకి సంబంధించిన సమస్యలుంటే నిపుణుల సలహా తీసుకోకుండా ఏం చేయకూడదని గుర్తుంచుకోండి.

ఆరోగ్య పరిస్థితిని బట్టీ రోజంతా విశ్రాంతి తీసుకోకుండా.. ఉదయం, సాయంత్రం వీలైనంత వరకూ వాకింగ్ చేయడం అలావాటుగా పెట్టుకోండి. వైద్యుల సలహా మేరకు.. చిన్న చిన్న పనులు చేయడం కూడా చేయొచ్చు. కొంతమంది ఆపరేషన్స్ తర్వాత.. ఓ పక్క బరువు పెరుగుతూనే ఉంటారు.. కానీ ఎప్పడూ నీరసంగా ఉంటారు.. దీని కారణం.. వారు తినే ఆహారంలో పోషకాలు తక్కువ కార్భోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం కూడా కావొచ్చు. తినే ఫుడ్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటన్నారు వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version