చాలా మంది చింతపండుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. చింతపండు కూరలో వేస్తే పుల్లటి రుచి వస్తుంది. అలానే చింతపండుతో పులిహోర మొదలైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. కానీ చింతపండు వల్ల కొన్ని రకాల సమస్యలు కూడా కలుగుతాయి కాబట్టి చింతపండుని అతిగా ఉపయోగించే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా చింతపండును తీసుకోవడం వలన ఈ నష్టాలు తప్పవు.
ఎక్కువగా చింతపండుని తీసుకోవడం వలన ఎలర్జీ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మైకం, దురద, వాపు మొదలైన ఇబ్బందులు వస్తాయి. మరీ ముఖ్యంగా పచ్చి చింత పండుని ఎప్పుడు తినకండి. జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు చింతపండుకి దూరంగా ఉండాలి. ఒకవేళ కనుక జీర్ణ సమస్యలు ఉంటే చింతపండుని అస్సలు తినొద్దు.
జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు చింతపండును తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం మొదలైన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఉదర సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే చింతపండుని అసలు ఉపయోగించకండి. అలానే చింతపండును తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. డయాబెటిస్ మందులతో పాటుగా చింతపండును తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు అసలు తీసుకోకండి. యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి.
చింతపండును తీసుకోవడం వలన గుండా ఆరోగ్యం బాగుంటుంది. అలానే చర్మం కూడా క్లియర్ గా ఉంటుంది లివర్ ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే. క్యాన్సర్ నుండి కూడా పోరాడుతుంది. దగ్గు జలుబు ఆస్తమా వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చింతపండు వలన లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా చింతపండుని తీసుకోకండి లిమిట్ గానే తీసుకోండి ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు తప్పవు.