అవాంఛిత రోమాలు అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ సమస్య అధికంగా ఉంటుంది. ముఖం మీద అనవసరంగా పెరిగే వెంట్రుకలు వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. దానివల్ల వారు చేయాలనుకున్న పని చేయలేక అవస్థలు పడుతుంటారు. అవతలి వాళ్ళు వెక్కిరించడమో, కాలేజీలో సరిగ్గా కాన్ సన్ ట్రేట్ చేయలేకపోవడమో జరుగుతుంటుంది. ఐతే ఈ సమస్యల్కి పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. ప్రస్తుతం ఈ అవాంఛిత రోమాలని పోగొట్టే ఇంటిచిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ముఖంపై ముఖ్యంగా పై పెదవి, గడ్డం భాగంలో వచ్చే వెంట్రుకలని పోగొట్టుకోవచ్చు.
శనగపిండితో చేసిన ప్యాక్:
మన వంటగదిలో ఉండే శనగ పిండితో ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. దీనికోసం, శనగపిండితో పాటు పసుపు ఉపయోగపడుతుంది. శనగపిండిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని, ఆ తర్వాత పసుపు కలపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్ ని ముఖ భాగానికి అప్లై చేసుకోండి. అది పూర్తిగా ఎండిన తర్వాత నీటితో శుభ్రపర్చుకోవాలి. ఇదే గాక, శనగపిండిలో పసుపుతో పాటు ఆవనూనెని కూడా వాడవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.
మెంతి మాస్క్
మెంతులు చర్మ ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి మాస్క్ తయారు చేసుకోవడానికి రెండు టీస్పూన్ల మెంతిపొడిని తీసుకుని, దానికి గ్రైండ్ చేసిన పచ్చి శనగలను కలుపుకోవాలి. అప్పుడు ఆ పొడిని గుడ్డులోణి తెల్లని భాగం, తేనెని కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 10-15నిమిషాలయ్యాక మృదువైన గుడ్డతో తుడిచివేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు. మీ అందాన్ని కప్పి ఉంచే అనవసర వెంట్రుకలు రాలిపోతాయి. ఆ సమస్య నుండి తొందరగా బయటపడతారు.